గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (11:23 IST)

సీఎం సిద్ధూకు లోకాయుక్త నోటీసులు.. 6న విచారణకు రావాలంటూ కబురు

Siddaramaiah
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన విచారణకు రావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కేసులో సిద్ధ రామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ కేసులో ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరుకావాలని లోకాయుక్త నోటీసుల్లో పేర్కొంది.

అలాగే, తనకు లోకాయుక్త పోలీసుల నుంచి నోటీసులు అందినట్టు సిద్ధరామయ్య కూడా వెల్లడించారు. అలాగే, నోటీసుల్లో పేర్కొన్నట్టుగా ఈ నెల 6వ తేదీన లోకాయుక్త ఎదుట హాజరవుతున్నట్టు చెప్పారు. ఇదే కేసులో ఆయన భార్య పార్వతిని గత నెల 25వ తేదీన విచారించిన విషయం తెల్సిందే. 
 
కాగా, బుధవారం ఉదయం లోకాయుక్త ఎదుట హాజరుకావాలని నోటీసులు ఇచ్చామని లోకాయుక్త సీనియర్ అధికారి ఒకరు ఓ వార్తా సంస్థకు వెల్లడించారు. సిద్ధరామయ్య భార్య పార్వతి సోదరులు కొంత భూమిని కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో పోలీసులు సెప్టెంబరు 27వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ భూవివాదం ఇపుడు సీఎం సిద్ధరామయ్య మెడకు చుట్టుకోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది.