సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (16:04 IST)

రాజధానిలో భారీ శబ్దాలు.. బెంగళూరులో అలా ఎందుకంటే.?

Bangolore
కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ శబ్దం వినిపించింది. దీంతో బెంగళూరు నగర వాసులు ఉలిక్కిపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం వినిపించిన ఈ భారీ శబ్దం ధాటికి పలు నివాసాల్లో అద్దాలు ధ్వంసమయ్యాయి.

హెచ్‌ఎస్ఆర్ లే అవుట్, మహదేవపుర, సిల్క్‌బోర్డ్, మడివాల, బొమ్మనహళ్లి, కొత్తనూరు, అగర, హుళిమావు, అనేకల్, పద్మానభ నగర్ వంటి పలు ప్రాంతాల్లో ఈ శబ్దం వినిపించింది. ఈ శబ్దానికి గల కారణాలపై బెంగళూరు పోలీసుల ఆరాతీస్తున్నారు.
 
అయితే ఈ శబ్దం గత సంవత్సరం సోనిక్‌ బూమ్‌ను గుర్తుచేస్తోంది. 2020 మేలో కూడా బెంగళూరు అంతటా ఒక్కసారిగా భారీ శబ్ధాలు వినిపించిన విషయం తెలిసిందే. ఇది మరొక సోనిక్ బూమ్‌ అని బెంగళూరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ శబ్ధంపై హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్పందిస్తూ.. తమ విమానాలు ఇలాంటి శబ్దాలు చేయలేదని స్పష్టం చేసింది.