శుక్రవారం, 21 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 నవంబరు 2025 (19:17 IST)

దీని గురించి మీకు తెలియదు.. దగ్గరికి రాకండి.. భార్యను నడిరోడ్డుపైనే చంపేసిన భర్త (video)

Husband Attack On His Wife
Husband Attack On His Wife
కుటుంబ విలువలు సన్నగిల్లుతున్నాయి. భార్యాభర్తల అనుబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఇందుకు వివాహేతర సంబంధాలే కారణమవుతున్నాయి. ఈ వివాహేతర సంబంధాల కారణంగా భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడలో దారుణం జరిగింది. 
 
కట్టుకున్న భార్యను ఓ భర్త నడిరోడ్డుపై భార్యను అతి కిరాతంగా కత్తితో దాడి చేసి చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన విజయ్‌, సరస్వతి 2022 ఫిబ్రవరి 14వ తేదీన లవ్‌ మ్యారేజి చేసుకున్నారు. సరస్వతి వీన్స్‌ ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్స్‌గా పనిచేస్తుండగా, విజయ్ భవానీపురం శ్రేయాస్‌ ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.
 
కానీ భార్యపై అనుమానంతో ఈ నేరానికి విజయ్ పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి అయ్యింది. గురువారం ఉదయం భార్య ఉన్న చోటుకు విజయ్‌ కోపంగా వెళ్లాడు. నడిరోడ్డు మీదనే ఆమెపై కత్తితో దాడి చేశాడు. కిరాతకంగా ఆమెను పొడిచి చంపేశాడు. అంతటితో ఆగకుండా గొంతు కోశాడు. స్థానికులను బెదిరించాడు. దీని గురించి మీకు తెలియదంటూ.. దగ్గరికి రాకూడదని మండిపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.