Bad girl: బ్యాడ్ గర్ల్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా.. శోభిత కితాబు
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ నిర్మాణంలో బ్యాడ్ గర్ల్ అనే చిత్రం తెరకెక్కింది. వర్ష భరత్ కుమార్ ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. సామాజిక కట్టుబాట్ల మధ్య స్వేచ్ఛగా జీవించాలని ఆరాటపడే ఓ మధ్యతరగతి యువతి కథగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంపై విమర్శలతో పాటు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
ఈ సినిమాపై అక్కినేని నాగార్జున కోడలు శోభిత స్పందించారు. ఈ వివాదాస్పద చిత్రంపై శోభిత ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా చూసి చలించిపోయానని.. తప్పకుండా అమ్మాయిలు ఈ చిత్రాన్ని చూడాలన్నారు.
బ్యాడ్ గర్ల్ అనే ఈ సినిమా తనను నవ్వించింది. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదని.. ముఖ్యంగా అమ్మాయిలు దీన్ని చూడాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది మనకోసం తీసిన చిత్రం. వర్ష భరత్, అంజలి శివరామన్‌ను అభినందించాలని శోభిత రాసుకొచ్చారు. ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.