గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (09:09 IST)

బాలికను లాక్కెళ్లి గ్యాంగ్ రేప్.. బాధితురాలిని కాపాడిని పెంపుడు కుక్క.. ఎలా?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాలికను బలవంతంగా లాక్కెళ్లిన ఇద్దరు కామాంధులు... ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, ఈ కామాంధులు చెర నుంచి బాధితురాలి పెంపుడు కుక్క కాపాడింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాలికను బలవంతంగా లాక్కెళ్లిన ఇద్దరు కామాంధులు... ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, ఈ కామాంధులు చెర నుంచి బాధితురాలి పెంపుడు కుక్క కాపాడింది. సాగర్ జిల్లా ఖురాయి తహసీల్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన రేషు అహిర్వార్, పునీత్ అహిర్వార్ అనే ఇద్దరు యువకులు బలవంతంగా పశు దాణా నిల్వవుంచిన గదిలోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ కామాంధుల చెర నుంచి తప్పించుకునేందుకు ఆ బాలిక తన పెంపుడు కుక్కను పిలిచింది. 
 
ఆ బాలిక పిలుపు విన్న ఆ కుక్క.. ఒక్క పరుగున వచ్చి అత్యాచారం చేసిన ఇద్దరు యువకులపై దాడి చేసి కరిచింది. దీంతో నిందితులైన ఇద్దరు యువకులు పారిపోయారు. కుక్క తన యజమానురాలైన బాలిక ఆపదలో ఉందని మొరుగుతుండటంతో స్థానిక ప్రజలు గుమిగూడి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు కామాంధులను అరెస్టు చేశారు.