శనివారం, 18 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2024 (09:08 IST)

మహారాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం... కీలక శాఖలన్నీ బీజేపీ వద్దే..

devendra - shinday - ajith
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలో మహాయుతి కూటమి ప్రభుత్వం ఇటీవల ఏర్పాటైంది. బీజేపీ, శివసేన, ఎన్సీపీలు కలిసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ కూటమి తరపున మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 39 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఇందులో కీలక మంత్రిత్వ శాఖలన్నీ భారతీయ జనతా పార్టీ వద్దే ఉంచుకుంది. 
 
మహారాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ (132) అత్యధిక స్థానాలు గెలుచుకున్న అతి పెద్ద పార్టీగా అవతరించింది. శివసేన (షిండే వర్గం) 57 స్థానాలు, ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) 41 స్థానాలల్లో గెలిచాయి. ఎక్కువ స్థానాల ఆధారంగా ఈసారి బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అయ్యారు. శివసేన అధినేత ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పోస్టులు చేపట్టారు. వీరు ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు.
 
కాగా, ఆదివారం మిగతా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కీలక శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకుంది. బీజేపీకి హోంశాఖ, రెవెన్యూ శాఖలు లభించాయి. ఎన్సీపీకి ఆర్థికశాఖ, శివసేనకు రవాణా శాఖ, వైద్య ఆరోగ్య
 
శాఖలు దక్కాయి. మొత్తమ్మీద, గెలిచిన ఎమ్మెల్యేల దామాషా ప్రకారం బీజేపీకి 19 మంత్రి పదవులు దక్కగా... శివసేనకు 12, ఎన్సీపీకి 9 మంత్రి పదవులు కేటాయించారు.