సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2023 (09:50 IST)

టీవీ సెట్‌టాప్ బాక్స్ షాక్: నాలుగేళ్ల బాలుడు మృతి

మహారాష్ట్రలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. టీవీ సెట్‌టాప్ బాక్స్ షాక్ కొట్టడంతో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. టీవీలో కార్టూన్లు చూస్తూ కేరింతలు కొడుతున్న కుమారుడు అంతలోనే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 
 
ఇంట్లో తండ్రి నిద్రిస్తుండగా, తల్లి వేరే పనుల్లో ఉంది. ఆ సమయంలో పిల్లాడు ఒంటరిగా టీవీలో కార్టూన్లు చూస్తున్నాడు.
ఈ క్రమంలో సెట్‌టాప్ బాక్స్‌ను లాగే ప్రయత్నం చేయడంతో అది ఒక్కసారిగా షాక్ కొట్టింది. దీంతో పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.