గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 5 ఏప్రియల్ 2021 (15:31 IST)

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకి తన రాజీనామా లేఖను పంపినట్టు సమాచారం. ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరమ్ బీర్ సింగ్ పిటిషన్ మేరకు బోంబే హైకోర్టు మంత్రి దేశ్‌ముఖపై సీబీఐ విచారణకు ఆదేశించింది.
 
ఈ నేపథ్యంలోనే మంత్రి పదవికి రాజీనామా చేస్తూ అనిల్ దేశ్‌ముఖ్ నిర్ణయం తీసుకున్నారు. హోంమంత్రి దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ చీఫ్ చేసిన అవినీతి ఆరోపణలు మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దేశ్‌ముఖ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి.