శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (06:22 IST)

ట్రంప్‌ వివాదాస్పద సలహాదారు స్కాట్‌ అట్లాస్‌ రాజీనామా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌‌ వివాదాస్పద సలహాదారు స్కాట్‌ అట్లాస్‌ రాజీనామా చేశారు. ట్రంప్‌ ప్రత్యేక సలహాదారుగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొంటూ.. తన రాజీనామా లేఖను ట్రంప్‌కు పంపించారు.

తనకు ఈ గౌరవాన్ని కల్పించిన ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త అధ్యక్షుడు జో బైటడన్‌కు అట్లాస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌ కు కరోనా వైరస్‌ పై సలహాదారుడిగా అట్లాస్‌ పనిచేశారు.
 
కరోనా మహమ్మారి కాలంలో దాని నుంచి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు, అమెరికన్లకు సాయం చేసేందుకు తాను ఎంతగానో కష్టపడ్డానని లేఖలో అట్లాస్‌ పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ నియంత్రణకు ఫేస్‌ మాస్కులు ధరించాలంటూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటనకు అట్లాస్‌ వ్యతిరేకంగా మాట్లాడి విమర్శలపాలయ్యారు.

ఫేస్‌మాస్కుల వల్ల ప్రయోజనం ఉండదన్న అట్లాస్‌ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ దానిని తక్కువగా చేసి చూపించేందుకు అట్లాస్‌ ప్రయత్నించారన్న విమర్శలు కూడా ఉన్నాయి.