సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2024 (20:15 IST)

మహారాష్ట్ర: ఒంటరిగా వున్న మహిళ వద్ద అలా నడుచుకున్నాడు.. గరిటెతో..?

woman
మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కామాంధుడికి సరిగ్గా బుద్ధి చెప్పింది. మహారాష్ట్ర థానే జిల్లా భీవండి పట్టణంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. 30 ఏళ్ల అనిల్ సత్యనారాయణ్ రచ్చ, 26 ఏళ్ల యువతికి అంతకు ముందే కొంత పరిచయం వుంది.  యువతి ఇంటిలో ఒంటరిగా ఉన్నదని తెలుసుకుని శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో అనిల్ సత్యనారాయణ్ ఆమె వద్దకు వచ్చాడు. 
 
లైంగికంగా ఆమెను లొంగదీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఒంటరిగా ఉన్న యువతి దగ్గరికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. తన ప్రైవేట్ పార్ట్స్ ఆమెకు చూపిస్తూ అడ్వాన్స్ తీసుకోబోయాడు. 
 
ఆ యువకుడి నుంచి తప్పించుకుని కిచెన్‌లోకి వెళ్లిన ఆ యువతి.. చేతికందిన గరిటె తీసుకుని యువకుడి ప్రైవేట్ పార్ట్‌పై ఒక్కటేసింది. ఆ యువకుడు చేతులతో బిగబట్టుకుని నేలపై పడిపోయాడు. యువతిపై అఘాయిత్యం చేద్దామనుకున్న యువకుడు ఆ తర్వాత అరుపులు, ఏడుపులతో హాస్పిటల్ చేరుకోవాల్సి వచ్చింది.