అంకుల్ అని పిలిచిన పాపానికి 18 ఏళ్ల బాలికపై దాడి
అంకుల్ అని పిలిచిన పాపానికి ఉత్తరాఖండ్‌లో 18 ఏళ్ల బాలికపై దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా, సితార్‌గంజ్ పట్టణ పరిధిలోని ఓ ప్రాంతంలో 35 ఏళ్ల దుకాణదారుడిని 18 ఏళ్ల బాలిక అంకుల్ అని పిలిచింది. దీంతో ఆ బాలికను ఆ వ్యక్తి దారుణంగా కొట్టాడు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాదితురాలు నిషా అహ్మద్‌గా గుర్తించబడింది.
డిసెంబర్ 19వ తేదీన, టీనేజ్ అమ్మాయి బ్యాడ్మింటన్ రాకెట్ కొనుగోలు చేసింది. మంగళవారం, ఆమె రాకెట్ మార్పిడి కోసం దుకాణానికి వెళ్లగా, దాని తీగలు కొన్ని విరిగిపోవడాన్ని గమనించింది. మోహిత్ కుమార్‌గా గుర్తించబడిన దుకాణదారుడు అతన్ని మామ అని సంబోధించడంతో విసుగు చెంది ఆమెను దారుణంగా కొట్టాడు. బాలిక తలకు గాయం కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు.
వైద్య సదుపాయంతో అప్రమత్తమైన పోలీసులు కేసును సుమోటోగా తీసుకున్నారు. అనంతరం బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నిందితుడు మోహిత్ కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 354, సెక్షన్ 323, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేయడం జరిగింది.