శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (17:02 IST)

షాంపూ అడిగినందుకు భార్యను చితకబాదాడు..

షాంపూ కొనివ్వమని అడిగినందుకు ఓ భర్త భార్యను చితకబాదాడు. ఈ దారుణ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని బావ్ల గ్రామంలో ఆదివారం నాడు చోటు చేసుకుంది. ఇది ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి కథనం ప్రకారం ఆదివారం ఉదయాన్నే తల స్నానం చేసేందుకు సిద్ధమైంది. షాంపూ కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వమని తన భర్తను అడిగింది.
 
అయితే భర్త ఒక్కసారిగా ఆమెపై కోపంతో ఊగిపోయాడు. ఆమెను అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. ఆమెను తీవ్రంగా కొట్టడమే కాకుండా గోడకు వేసి బాదాడు. దీంతో ఆమె విరమ్‌గామ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి భర్త రైల్వే శాఖలో క్లర్క్‌గా పని చేస్తున్నాడు. ఈ దంపతులకు పదిహేను సంవత్సరాల క్రితం వివాహమైంది. కాగా ప్రతీ చిన్న విషయానికి భార్యతో గొడవ పడటం, కొట్టడం భర్తకు అలవాటుగా మారింది.