గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మే 2024 (12:06 IST)

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

woman
భార్య మార్పిడికి భార్యను బలవంతం చేశాడనే ఆరోపణలపై వ్యక్తిపై కేసు నమోదైంది. 2008 నుండి నిందితుడితో ఆమెకు వివాహం జరిగింది. ఈ ఇద్దరికి ఒక కుమార్తె వుంది. అయితే భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
తన జీవిత భాగస్వామిని కొట్టి, చిత్రహింసలకు గురిచేసి, అసభ్యకరమైన ఫోటోలను క్లిక్ చేయడంతో పాటు భార్య మార్పిడికి బలవంతం చేసినందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదైంది.
 
లక్నోలోని ఆషియానా ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల భార్య తన భర్తపై ఫిర్యాదు చేసింది. సదరు మహిళకు 2008లో నిందితుడితో వివాహమై ఒక కుమార్తె కూడా ఉంది. పెళ్లయినప్పటి నుంచి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, ఆడపిల్ల పుట్టాక అది పెరిగిపోయిందని ఆరోపించింది.
 
తాను నిద్రిస్తున్న సమయంలో తన భర్త తన ఫోటోలను క్లిక్‌ చేసి తన స్నేహితులతో పంచుకున్నాడని ఆమె ఆరోపించింది. రోజురోజుకూ తన భర్త ప్రవర్తన దారుణంగా మారిందని ఆ మహిళ చెప్పింది. భర్త తనను వేధింపులకు గురిచేసి భార్య మార్పిడికి బలవంతం చేశాడని.. ఇంకా ఒప్పందం కుదుర్చుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చాడని చెప్పింది.
 
 ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతోందని ఆషియానా ఎస్‌హెచ్‌ఓ ఛత్రపాల్ సింగ్ తెలిపారు.