గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 నవంబరు 2024 (14:53 IST)

అంత జరిగినా ఏం జరగనట్లు క్యాజువల్‌గా వస్తున్నాడు.. (video)

Accident
Accident
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతుండటం కామనే. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని వీడియోలు నెటిజన్లను దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. మరికొన్ని రోడ్డు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకుని బయటపడిన వీడియోలు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకోనిస్తాయి. 
 
తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఏముందంటే.. ఓ టూవీలర్ ఎదురుగా కారును ఢీకొన్నాడు. టూవీలర్ నుంచి ఎగిరి కారుపై పడ్డాడు. ఈ ఘటనను చూసినవారంతా అయ్యో టూవీలరిస్టుకు ఏం జరిగిందోనని భయపడ్డారు. 
 
అయితే ఆ టూవీలరిస్ట్ ఏం జరగనట్లు కారు పై నుంచి క్యాజువల్‌గా దిగివచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై పలు రకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.