శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (13:26 IST)

హీరోయిన్‌ను చేస్తానని నమ్మించి సర్వస్వం దోచుకున్న కామాంధుడు

ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని మోసపోయింది. తాను ఒక సినిమా నిర్మాతనని, నువ్వు చాలా అందంగా ఉన్నావని మాయమాటలు చెప్పి ఆ విద్యార్థిని శీలాన్ని దోచుకున్నాడు. ఫలితంగా ఆ విద్యార్థిని డబ్బుతో పాటు శీలం కోల్పోయి పోలీసులను ఆశ్రయించింది. తమిళనాడులోని పాత మహాబలిపురంలో వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నై నగరానికి సమీపంలోని పాత మహాబలిపురానికి చెందిన ఓ విద్యార్థిని (25), గత నెల8వ తేదీన తన బంధువుల ఊరికి వెళ్లేందుకు బస్టాండులో ఒంటరిగా వేచివుంది. ఆ సమయంలో ఓ ఖరీదైన కారు వచ్చి ఆగగా, అందులో నుంచి దిగిన ఓ వ్యక్తి, తాను సినీ నిర్మాతనని ఆమెను పరిచయం చేసుకున్నాడు.
 
తాను ఓ కొత్త సినిమాకు ప్లాన్ చేస్తూ, హీరోయిన్‌ను కోసం పర్యాటక ప్రాంతమైన మహాబలిపురం వెళుతుండగా, నువ్వు కనిపించావని చెప్పాడు. పైగా, తన చిత్రంలో హీరోయిన్ పాత్రకు సరిగ్గా సరిపోతావని చెబుతూ, నటిస్తారా? అని నమ్మకం కలిగించేలా మాట్లాడాడు. ఆ సమయంలో ఆనందపడిపోయిన ఆమె, నటించేందుకు అంగీకరించగా, మాట్లాడుకుందామని చెబుతూ, తన కారులో మహాబలిపురం ప్రాంతానికి తీసుకెళ్లాడు. 
 
అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకున్న ఆ వ్యక్తి, కథా చర్చలంటూ ఆమెను రంగంలోకి దించాడు. ఆమె కూడా అవకాశం కోసం అతనితో సన్నిహితంగా మెలిగింది. ఆపై అతను తిరిగి 17వ తేదీన కలుద్దామని, అప్పుడు కొంత డబ్బు తేవాలని కోరాడు. సదరు వ్యక్తి మాటలు నమ్మిన ఆ విద్యార్థిని.. తల్లిదండ్రులకు తెలియకుండా రూ.60 వేలు తీసుకెళ్లి ఇచ్చింది. ఆ డబ్బుతో కోయంబత్తూరుకు వెళ్లిన వారిద్దరూ అక్కడ ఓ హోటల్‌లో గదిని తీసుకుని ఏకాంతంగా గడిపారు.
 
మరి, తన సినిమా ఛాన్స్ ఏమైందని ఆమె ప్రశ్నించగా, ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడు ఆ కామాంధుడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె, తన తల్లికి విషయం చెప్పి, పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో సెమ్మంజేరి పోలీసులు కేసు నమోదు చేసి, సదరు వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.