త్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ... ప్రాణాలు కోల్పోయిన ఇంజనీర్

treadmill
ఠాగూర్| Last Updated: శనివారం, 28 సెప్టెంబరు 2019 (17:29 IST)
కొంతమంది జిమ్‌లో కసరత్తులు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇపుడు ఓ ఇంజనీర్ త్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ అదుపుతప్పి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర
సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రామ్ నగర్‌లో జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రామ్‌ నగర్‌కు చెందిన సుధీర్ ఉపాధ్యాయ్ తన బంధువు నారాయణ్ జోషితో పాటు ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ 76లోని జేఎం ఆర్కిడ్ సొసైటీలో నివసిస్తున్నారు. సుధీర్ వ్యాయామంలో భాగంగా, త్రెడ్‌మిల్‌పై నడక సాగిస్తూ వచ్చాడు.

ఈ క్రమంలో అతను అదుపుతప్పి కిందపడిపోయాడు. దీన్ని గమనించిన జిమ్‌లోని వారంతా అతనిని సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతను మృతిచెందాడని తేల్చిచెప్పారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నివేదిక కోసం గాలిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :