శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2019 (12:12 IST)

#AlaVaikunthapurramuloo 'సామజవరగమన .. నిను చూసి ఆగగలనా'....

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం అలా వైకుంఠపురంలో... చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. 
 
తాజాగా ఈ సినిమా నుంచి తొలి సింగిల్ సాంగ్‌ను విడుదల చేశారు. 'సామజవరగమన.. నిను చూసి ఆగగలనా.. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా' అంటూ ఈ పాట సాగుతోంది.
 
నాయకుడు .. నాయకి వెంటపడుతూ, ఆమె పట్ల తనకి గల ప్రేమను వ్యక్తం చేసే సందర్భంలో వచ్చే పాటగా ఇది అనిపిస్తోంది. ఈ పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారగా థమన్ సంగీత బాణీలు సమకూర్చగా, సిద్ శ్రీరామ్ ఆలపించారు. 
 
సొగసైన అర్థాలు వచ్చే పదునైన పద ప్రయోగాలు చేస్తూ ఆయన పాటను అందించిన ఈ సాంగ్ యువతను ఆకట్టుకునేలా వున్నాయి. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు కీలకమైన పాత్రను పోషిస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.