అల‌.. వైకుంఠ‌పుర‌ములో.. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌

శ్రీ| Last Updated: శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (15:01 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం అల‌.. వైకుంఠ‌పుర‌ములో. గీతా ఆర్ట్స్ మ‌రియు హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న సాంగ్ ని త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు చిత్ర నిర్మాణ సంస్థ అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసింది.

ఈ పాట‌కు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించ‌గా... త‌మ‌న్ సంగీతం అందించారు. సిడ్ శ్రీరామ్ స్వ‌ర‌ప‌రిచారు. దసరా స్పెషల్‌‌గా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇక 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా.. శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు స‌క్స‌స్ సాధించ‌డంతో తాజా చిత్రం అల‌.. వైకుంఠ‌పుర‌ములో కూడా స‌క్సస్ అవుతుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి... ఏ స్ధాయి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి.దీనిపై మరింత చదవండి :