బుధవారం, 12 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 మార్చి 2025 (13:40 IST)

రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ రీల్స్ చేసిన యువకుడు

Train
Train
సోషల్ మీడియా ప్రభావం యువతపై అంతా ఇంతా కాదు. రీల్స్ కోసం ప్రాణాలపైకి తెచ్చుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. రీల్స్ కోసం సాహసాలు చేస్తున్నారు చాలామంది. తాజాగా కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ ఓ యువకుడు ప్రమాదకర స్టంట్ చేశాడు. 
 
ఆ తర్వాత రైలు వేగం తగ్గాక నేలపై దిగబోయి వెనక్కి పడిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ కాస్గంజ్- కాన్పూర్ స్టేషన్ల మధ్య జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

1:10 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో, ఆ యువకుడు తోటి ప్రయాణీకుడి చేయి 56 సెకన్ల పాటు పట్టుకుని, వేగంగా దూసుకుపోతున్న రైలు వెలుపల వేలాడుతూ కనిపించాడు. పక్క స్టేషను రావడంతో రైలు ఆగిపోయింది. 
 
బహుశా ఎవరో గొలుసు లాగడం వల్ల రైలు ఆగడంతో ఆ యువకుడు కిందపడి గాయపడ్డాడు. వెంటనే అతను లేచి రైలు ఎక్కాడు. ఈ ఘటనతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.