గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (14:00 IST)

ప్రయాణికుడికి చేదు అనుభవం... టాయిలెట్‌లో ప్రయాణం

spicejet
బెంగుళూరు వెళ్లేందుకు విమానం ఎక్కిన ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆ ప్రయాణికుడు తన జర్నీని విమానం టాయిలెట్‌లో కూర్చొనే ప్రయాణం పూర్తి చేశాడు. త్వరగా సౌకర్యవంతంగా ఉంటుదని విమానం ఎక్కగా, ఆ ప్రయాణికుడికి మాత్రం ఈ వింత అనుభవం ఎందురైంది. టాయిలెట్ డోర్ లాక్ తెరుచుకోకపోవడంతో ఆయన తన గమ్యం చేరేదాకా అందులోనే చిక్కుకునిపోయాడు. ఈ ఘటన మంగళవారం ముంబై నుంచి బెంగుళూరుకు బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో చోటు చేసుకుంది.
 
బాధితుడు వెల్లడించిన వివరాల మేరకు... మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు స్వైస్ జెట్ విమానం ఎస్ జి 268 బెంగుళూరుకు బయలుదేరింది. టేకాఫ్ అయిన తర్వాత ఓ ప్రయాణికుడు టాయిలెట్‌కు వెళ్ళఆడు. అయితే మాల్ ఫంక్షన్ కారణంగా డోర్ తెరుచుకోకపోవడంతో లోపలే చిక్కకునిపోయాడు. డోర్ తెరిచేందుకు బయట నుంచి సిబ్బంది చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో ఆ ప్రయాణికుడు ఆ విమానంలో ఉండిపోయాడు. 
 
ఎయిర్‌హోస్టెస్ ఓ కాగితంపై నోట్ రాసి డోర్ కింది నుంచి లోపలికి పంపించింది. డోర్ బయట నుంచి కూడా తెరుచుకోవడం లేదని, విమానం ల్యాండయ్యాక ఇంజనీర్లు వచ్చి డోర్ ఓపెన్ చేస్తారని, అంతవరకు టాయిలెట్‌లోనే ఉండాలని సలహా ఇచ్చింది. పైగా, టాయిలెట్ సీటుపై జాగ్రత్తగా కూర్చొని దెబ్బలు తగలకుండా చూసుకోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చింది.