మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జులై 2023 (23:07 IST)

మణిపూర్ వీడియో.. అసలు ఏం జరిగింది..?

woman
మణిపూర్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. షెడ్యూల్ తెగ అంశంపై మెయిటీ, కుకీ జాతుల మధ్య గత రెండు నెలల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది హింసాత్మంగా మారాయి. పలువురు ప్రాణాలను బలిగొన్నాయి. ఇదే మణిపూర్‌లో చోటుచేసుకున్న అల్లర్లకు ప్రధాన కారణంగా నిలిచింది. 
 
ఈ ఇరు వర్గాల దాడులతో ఇద్దరు మహిళలు భద్రత కోసం కొండ అంచుల్లోకి వెళ్లిపోయారు. అయితే తమ కమ్యూనిటికీ చెందిన మహిళలు అత్యాచారానికి గురయ్యారనే ప్రచారం జరగడంతో ఆ కమ్యూనిటీకి చెందిన వారు ఓ గ్రామంపై దాడి దాడి చేశారు. ఇందులో భాగంగా ఓ గ్రూపును వెంబడించారు. ఆ గ్రూపులో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు వున్నారు. 
 
ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ఇందులో 56 ఏళ్ల వ్యక్తి, అతని 19 ఏళ్ల తనయుడు, 21 ఏళ్ల కూతురు ఉన్నారు. వారితో పాటు మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారిలో ఒకరి వయస్సు 42 ఏళ్లు, మరొకరి వయస్సు 52 ఏళ్లు. వీరు అడవికి వెళ్తున్న సమయంలో ఓ పోలీస్ టీం వారికి కనిపించింది. వారి సంరక్షణలో వెళ్తుండగా... దాదాపు వెయ్యి మందితో వున్న మరో గుంపు వచ్చి వారిని లాక్కెళ్లారు. 
 
అంతేగాకుండా 19 ఏళ్ల యువకుడు తన 21 ఏళ్ల సోదరిని ఆ గుంపు నుండి రక్షించే ప్రయత్నం చేసినప్పుడు అతనిని, అతని తండ్రిని చంపేశారు. ఈ సమయంలోనే 21 ఏళ్ల మహిళతో పాటు మరో మహిళను నగ్నంగా ఊరేగిస్తూ పంటపొలాల్లోకి తీసుకు వెళ్లారు. 
 
ఇందులో ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లుగా బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై మే 18న జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును మే 21న నోగ్ పోక్ సెక్మై పోలీస్ స్టేషన్ కు బదలీ చేశారు. మే 3వ తేదీ నుంటి ఇంటర్నెట్ నిలిపివేశారు. 
 
దీంతో ఈ వీడియో ఇప్పుడు వెలుగు చూడటంతో పాటు వైరల్‌గా మారింది. ఈ వీడియో వెలుగు చూసిన మరుసటి రోజు ఆ గుంపులోని ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వీడియోలోని ఇతర నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ దారుణ సంఘటనపై చలించిపోయిన సుప్రీంకోర్టు కేంద్రానికి చీవాట్లు పెట్టింది. మణిపూర్‌లో ఆందోళనలు కూడా వెల్లువెత్తాయి.