ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జులై 2023 (10:02 IST)

మణిపూర్‌లో దారుణం.. మొండెం నుంచి తలను వేరు చేసి?

crime scene
మణిపూర్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. జాతుల మధ్య ఘర్షణలతో ఓ వ్యక్తిని చంపిన ఓ వర్గం ప్రజలు అతడి మొండెం నుంచి తలను వేరు చేసి దానిని కంచెకు తగిలించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బిష్ణుపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ నెల 2న ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
 
అదే రోజు రాత్రి జరిగిన ఘర్షణల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కంచెకు వేలాడదీసిన తలను డేవిడ్‌దిగా గుర్తించారు. కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.