శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2016 (09:02 IST)

బంధువే వివాహితను తీసుకువెళ్లి నలుగురితో కలిసి గ్యాంగ్ రేప్ చేసి చంపాడు...

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. సమీప బంధువే ఓ వివాహితను తీసుకువెళ్లి నలుగురితో కలిసి గ్యాంగ్ రేప్ చేయించి, హతమార్చిన దారుణ ఘటన జరిగింది. మేవాత్ జిల్లాలో పట్టణానికి చెందిన 35 యేళ్ల వివాహితను పుట్టి

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. సమీప బంధువే ఓ వివాహితను తీసుకువెళ్లి నలుగురితో కలిసి గ్యాంగ్ రేప్ చేయించి, హతమార్చిన దారుణ ఘటన జరిగింది. మేవాత్ జిల్లాలో పట్టణానికి చెందిన 35 యేళ్ల వివాహితను పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకువెళతానని చెప్పిన సమీపబంధువు నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. మరో నలుగురితో కలిసి వివాహితపై సామూహిక అత్యాచారం చేశాడు. 
 
ఆపై ఆమెను చంపి చెట్ల పొదల్లో వేసి పారిపోయారు. మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం వద్ద బీరు బాటిళ్లు, బాధితురాలి గాజులు పగిలి ఉన్నాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి నిందితులపై కేసు నమోదు చేశామని మేవాట్ ఎస్పీ కుల్దీప్ సింగ్ చెప్పారు.