సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 24 మార్చి 2021 (16:14 IST)

భర్తను వదిలేసి రమ్మన్న ప్రియుడు, రానన్నందుకు హతమార్చాడు

భర్తను వదిలేసి తనతో వచ్చేయాలని ప్రియుడు అడిగాడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో నమ్మించి తనతో తీసుకుని వెళ్లి ఊరికి దూరంగా వున్న దట్టమైన చెట్ల తోపుల్లో హత్య చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. ఈ హత్య మార్చి 17న తిరుపోరూరు నుంచి మాంబాక్కం వెళ్లే మార్గంలో కాయార్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. తొలుత గుర్తు తెలియని మహిళ హత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసారు.
 
వివరాల్లోకి వెళితే... చెన్నై టి.నగర్ లోని ఓ వస్త్ర దుకాణంలో 30 ఏళ్ల చంద్ర అనే మహిళ పనిచేస్తోంది. ఈమె భర్త మణికంఠన్ పెయింటర్. ఇతడి స్నేహితుడు దినేష్. ఈ క్రమంలో దినేష్ తరచూ మణికంఠన్ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. మణికంఠన్ భార్య చంద్రపై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకుని ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
 
భర్త మణికంఠన్ ను వదిలేసి తనతో వచ్చేయమని దినేష్ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో ఆమెను నమ్మించి మార్చి 17వ తేదీన కాయార్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఆమెను హతమార్చి ఏమీ తెలియనట్లు వచ్చేశాడు. పోలీసులు దర్యాప్తులో అతడు ఆమెను 17వ తేదీ బైకుపై తీసుకెళ్లినట్లు తేలడంతో అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది.