బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 18 మార్చి 2021 (11:40 IST)

నువ్వు గర్భవతివా? ఔను నా ప్రియుడి వల్ల వచ్చిందన్న భార్య, కాలువలో దూకేశాడు

పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె తన ప్రియుడ్ని వదల్లేదు. ఏకంగా అతడితో శృంగారంలో పాల్గొని గర్భవతి అయ్యింది. ఆ తర్వాత విషయాన్ని భర్తకు చెప్పింది. అంతటితో ఊరుకోకుండా తన ప్రియుడుతో కలిసి భర్తను మాటలతో టార్చర్ చేయడం ప్రారంభించింది.
 
వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో మాల్యాలకు చెందిన రాజుతో బొంకూరు గ్రామానికి చెందిన రమ్యకు ఏడాది క్రితం వివాహం జరిగింది. ఐతే రమ్యకు అంతకుముందే రాజేందర్ అనే యువకుడితో అక్రమ సంబంధం వుంది. పెళ్లయినప్పటికీ అతడితో తిరుగుతూ వుండేది. ఈ విషయంపై భార్య రమ్యను హెచ్చరించాడు రాజు. కానీ అతడి మాటలను ఏమీ పట్టంచుకోలేదు.
 
ప్రియుడు రాజేందర్‌తో లైంగికంగా కలిసి గర్భం తెచ్చుకుంది. తను గర్భవతినని భర్తతో చెప్పి, ఆ గర్భానికి కారణం తన ప్రియుడు రాజేందర్ అని చెప్పి షాకిచ్చింది. ఆ తర్వాత తన పుట్టింటికి వెళ్లి అబార్షన్ చేయించుకుంది. పుట్టింటి వద్దే వుంటూ భర్త రాజుకు ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టింది. నువ్వు బ్రతికి వుండి మమ్మల్నెందుకు హింసిస్తున్నావు, త్వరగా చనిపోతే నా ప్రియుడు రాజేందర్‌తో సుఖంగా వుంటానంటూ ఫోన్లో వేధించడం ప్రారంభించింది.
 
ఆమెతో పాటు ప్రియుడు కూడా జత కలిశాడు. వారి ఫోన్ వేధింపులను తట్టుకోలేని రాజు.. సమీపంలో వున్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు కనబడకపోయేసరికి అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. అతడి సెల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు అతడి శవాన్ని చెరువులో కనుగొన్నారు. అతడి చావుకు కారకులైన భార్యను, ఆమె ప్రియుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.