బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 5 జులై 2019 (18:53 IST)

బ్యాంక్ మేనేజర్‌ చెంపఛెళ్లుమనిపించిన ఎమ్ఎన్ఎస్ వైస్ ప్రెసిడెంట్..

మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) ఉపాధ్యక్షుడు రాజు ఉబర్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంక్ మేనేజర్‌పై దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర, యావత్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. సహారా బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ స్కీమ్ ప్రకారం ప్రజలు జమ చేసిన డబ్బుకు అధిక వడ్డీ రేటును ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని తెలిసి.. ఉబర్కర్ అక్కడికి వెళ్ళారు. 
 
అక్కడ బ్యాంక్ మేనేజర్‌తో ప్రజలు డిపాజిట్ చేసే మొత్తానికి అధిక వడ్డీరేటు ఎందుకు ఇవ్వలేదని అడిగారు. కానీ బ్యాంక్ మేనేజర్ రాజు ఉబర్కర్‌ మాటలు పట్టించుకోకపోవడంతో పాటు బ్యాంక్ స్కీమ్ ప్రకారం ప్రజలకు వడ్డీ రేట్లు ఇచ్చే అంశంపై సమాచారం ఇచ్చేందుకు కూడా అంగీకరించలేదు. ఇంకా వినియోగదారుల బ్యాంక్ సమాచారాన్ని వెల్లడించడం కుదరదని చెప్పారు. 
 
ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య వాగులాట చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన ఉబర్కర్.. బ్యాంక్ మేనేజర్‌పై దురుసుగా ప్రవర్తించారు. అతని చెంపఛెల్లుమనిపించారు. బ్యాంకులోనే మేనేజర్‌పై దాడిచేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని రాజు ఉబర్కర్‌ను అరెస్ట్ చేశారు. దర్యాప్తు మొదలెట్టారు.