1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 24 మే 2025 (12:39 IST)

Monsoon to hit kerala: మరో 24 గంటల్లో కేరళను తాకనున్న ఋతుపవనాలు

clouds
గత రెండు రోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో మే 25 ఆదివారం నాటికి ఋతుపవనాలు కేరళను (Monsoon to hit kerala) తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బలమైన పశ్చిమ గాలుల కారణంగా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తిరువనంతపురం జిల్లాలో భారీ వర్షం కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తం కావడంతో IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది.
 
2009లో మే 23న కేరళలో రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందే ప్రవేశించాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ ఏడాది కేరళను రుతుపవనాలు తాకే అవకాశం వున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. మళ్లీ 16 ఏళ్ల తర్వాత ఋతు పవనాలు ముందుగా ప్రవేశించనున్నట్లు తెలిపారు. అంటే గత సంవత్సరం కంటే ఐదు రోజులు ముందుగా రుతుపవనాలు మే 30న కేరళను తాకాయి.
 
తిరువనంతపురంలో రెడ్ అలర్ట్
భారీ వర్షాలు సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగించడంతో శుక్రవారం సాయంత్రం తిరువనంతపురం జిల్లాకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం త్రిస్సూర్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసరగోడ్ లకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. మరోవైపు రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వ్యాపించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.