ఆన్‌లైన్ గేమ్స్ కోసం అప్పులు చేసింది.. ఇద్దరు పిల్లలతో మహిళ ఆత్మహత్య
ఆన్‌లైన్ గేమ్స్ కోసం అప్పులు చేసింది. ఆ బాధ తాళలేక ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మల్లికార్జున్‌నగర్‌కు చెందిన అవిశెట్టి మల్లేశ్ లారీ డ్రైవర్. ఇతడికి భార్య రాజేశ్వరి (28), పిల్లలు అనిరుధ్ (5) హర్షవర్ధన్ (2) ఉన్నారు.
మంగళవారం సాయంత్రం భర్త ఇంట్లో లేనప్పుడు ఇద్దరు పిల్లలను నీటి సంపులో పడేసిన రాజేశ్వరి.. తర్వాత తాను కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో సంపులో ముగ్గురూ విగతజీవులుగా తేలుతూ కనిపించారు. దీంతో ఆమె భర్తకు సమాచారం ఇచ్చిన స్థానికులు.. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజేశ్వరి మొబైల్‌లో ఎప్పుడూ లూడో గేమ్స్ ఆడుతూ ఉండేదని.. ఈ క్రమంలో రూ.4లక్షల వరకు బంధువుల దగ్గర అప్పు తీసుకుందని స్థానికులు చెప్తున్నారు.
గేమ్స్‌లో అవి పోవడంతో అప్పుల వారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో అప్పు తీర్చే దారి లేక పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుని చేసుకున్నట్లు తెలుస్తోంది.