ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరా.. మోదీని ప్రశ్నించిన భరత్
పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఎంపీ భరత్ రామ్ లోక్‌సభ ప్రత్యేక హోదాపై మోదీని నిలదీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ బడ్జెట్‌లో ఏపీకి సంబంధించి ప్రత్యేకంగా ఏమీ లేవని భరత్ రామ్ చెప్పారు. చంద్రబాబు యూటర్న్ తీసుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదన్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా 18 వైద్య కళాశాలలు తీసుకురావాలని చూస్తుంటే.. కేంద్రం మూడింటికి నిధులు ఇస్తామని చెప్పిందని భరత్ రామ్ తెలిపారు.
రైల్వే పరంగా విశాఖపట్నం విజయవాడకు మూడో లైను ఇవ్వాల్సి వుందని.. విశాఖపట్నం చెన్నై, చెన్నై బెంగళూరు , హైదరాబాద్ కారిడార్లకు నిధులు ఇస్తే 80 జిల్లాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్‌ను హైదరాబాద్ కు ఇచ్చారని రాష్ట్రానికి ఏదో ఒకటి ఇచ్చి ఉంటే బాగుండేదని భరత్ రామ్ వెల్లడించారు.