ఆదివారం, 3 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (13:33 IST)

అందరూ డబ్బు కోసమే ఉద్యోగం చేస్తారు.. భవానీ శంకర్

Priya bhavani
Priya bhavani
ప్రముఖ తమిళ నటి ప్రియా భవానీ శంకర్ తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. కోలీవుడ్ నటి అయిన భవానీ శంకర్.. 'మాన్‌స్టర్‌', తిరుచిట్రంబళం (తెలుగులో తిరు)  వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె భారతీయుడు 2 సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తోంది. 
 
ప్రియా భవానీ శంకర్ న్యూస్ టెలివిజన్‌లో యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది, తరువాత టీవీ సీరియల్స్‌లో నటించింది. ప్రస్తుతం హీరోయిన్ గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు నటి కావాలనే కోరిక లేదని, డబ్బులు ఎక్కువ రావడం వల్లే నటించేందుకు వచ్చానని చెప్పింది.
 
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పలువురు ఆయనపై పలు రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారాలు జరుగుతుండగా, ఇప్పుడు తన ట్విట్టర్ పేజీ ద్వారా వివరణ ఇచ్చింది.
 
ఇంకా భవానీ శంకర్ మాట్లాడుతూ.. తనపై వచ్చిన అపవాదులకు స్పందించకూడదని అనుకున్నాను. తాను చెప్పిన దాంట్లో తప్పేముంది? అందరూ డబ్బు కోసమే పని చేస్తారు. కానీ ఒక నటి చెబితే అది ఎందుకు చెడుగా కనిపిస్తుంది? అని ప్రశ్నించింది. అందరూ డబ్బు కోసం ఉద్యోగం చేస్తారనే విషయాన్ని మళ్లీ మళ్లీ భవానీ నొక్కి చెప్పారు.