గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (17:51 IST)

తాతగా ప్రమోషన్ పొందిన ముఖేష్ : తండ్రి అయిన అకాశ్ అంబానీ!

దేశ పారిశ్రామికదిగ్గజం, బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రమోషన్ పొందారు. ఆయన తాత అయ్యారు. ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రి అయ్యారు. దీంతో ముఖేష్ అంబానీ తాతగా మారిపోయారు. 
 
ఆకాష్ - శోక్లా దంపతులకు దంపతులకు ముంబైలో గురువారం ఓ మగ శిశువు జన్మించాడు. తల్లి, కొడుకు ఇరువురు క్షేమంగా ఉన్నట్లు అంబానీ కుటుంబ అధికార ప్రతినిధి ప్రకటనలో తెలిపారు.
 
కాగా, ప్రముఖ వజ్రాల వ్యాపారి రుస్సెల్‌ మెహతా కుమార్తె శోక్లాతో ఆకాశ్‌ వివాహం మార్చి 2019లో జరిగిన విషయం తెలిసిందే. అంబానీ (63), నీతా దంపతులకు ముగ్గురు సంతానం. వీరి పేర్లు ఆకాశ్‌, ఇషా, అనంత్‌ (25)లు. 
 
గతకొంతకాలంగా విదేశాల్లో ఉన్న అంబానీ కుటుంబం దీపావళి పర్వదినం ముందే ముంబైకి చేరుకుంది. మొదటిసారి నానమ్మ, తాతయ్య ప్రమోషన్‌ అందుకోవడంపై నీతా, ముఖేష్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ధీరూబాయి - కోకిలాబెన్‌ అంబానీల ముని మనవడికి స్వాగతం అని అన్నారు.