'అతడిని క్షమించలేను.. చంపేయండి' కుమార్తె ఫొటోతో ఉషా ధనంజయన్

nimmi couple
pnr| Last Updated: గురువారం, 31 డిశెంబరు 2015 (12:06 IST)
తన కుమార్తెను హత్య చేసిన అల్లుడిని తక్షణం చంపేయాలని, అతన్ని క్షమించి మరణభిక్ష ప్రసాదించలేనని ముంబైకు చెందిన ఉషా ధనంజయన్ వాపోయింది. తన అల్లుడికి విధించిన మరణశిక్షను వీలైనంత త్వరగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది.

ముంబైకు చెందిన నిమ్మీ ధనంజయన్... తన కాలేజీలో చదివే అతిఫ్ పొపెరె ప్రేమించాడు. 2008లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్తైన తర్వాత నిమ్మీ తన పేరును బుష్రాగా మార్చుకుంది. తర్వాత వారిద్దరూ దుబాయ్ వెళ్లిపోయారు. 2009లో వీరికి పాప పుట్టింది. 2013, మార్చిలో 24 ఏళ్ల బుష్రాను అతీఫ్ హత్యచేశాడు. తనకున్న అక్రమసంబంధం గురించి ప్రశ్నించినందుకే ఆమెను అంతమొందించాడు.

అతీఫ్, అతడికి సహాయ పడిన మరో వ్యక్తికి దుబాయ్ కోర్టు మరణదండన విధించింది. వీరిని కాల్చిచంపాలని ఆదేశించింది. మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలన్న అతడిని అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఇక అతడికి నిమ్మీ కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే తప్పా మరణశిక్ష ఆగదు.

అయితే అతడిని క్షమించబోమని నిమ్మీ తల్లి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తన మనవరాలిని అప్పగించాలని బాంబే హైకోర్టును ఉషా ధనంజయన్ ఆశ్రయించారు. దీనిపై జనవరి 15న కోర్టు విచారణ చేపట్టనుంది.దీనిపై మరింత చదవండి :