గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 6 మార్చి 2017 (17:16 IST)

అమ్మ ప్రేమతో మాట్లాడితే చిన్నమ్మకు నచ్చదు..నలుగురిని కొట్టి పంపించింది: జె. డ్రైవర్

కొడనాడులో అమ్మ జయలలితకు డ్రైవర్‌గా పనిచేసిన దివాకర్ అనే వ్యక్తి చిన్నమ్మ శశికళ బాగోతం బయటపెట్టాడు. ఆమె నైజాన్ని మీడియా ముందు వెల్లగక్కాడు. దివంగత సీఎం జయలలిత ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడితే.. చిన్నమ్మ శ

కొడనాడులో అమ్మ జయలలితకు డ్రైవర్‌గా పనిచేసిన దివాకర్ అనే వ్యక్తి చిన్నమ్మ శశికళ బాగోతం బయటపెట్టాడు. ఆమె నైజాన్ని మీడియా ముందు వెల్లగక్కాడు. దివంగత సీఎం జయలలిత ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడితే.. చిన్నమ్మ శశికళకు ఏమాత్రం నచ్చదన్నాడు. జయమ్మ అప్పుడప్పుడు బస చేసే కొడనాడు ఎస్టేట్‌లో డ్రైవర్‌గా పనిచేసే దివాకర్ (42) జయలలిత అందరితో ప్రేమగా మాట్లాడుతారని చెప్పాడు. 
 
అయితే చిన్నమ్మ శశికళను చూస్తే అందరూ జడుసుకుంటారని చెప్పాడు. 2005 నుంచి 2009 వరకు అమ్మకు ముందు భద్రత కోసం వెళ్లే కారులో తాను డ్రైవర్‌గా పనిచేసే వాడినని తెలిపాడు. ఎవరితోనైనా అమ్మ ప్రేమగా మాట్లాడింది తెలిస్తే.. వారిని వెంటనే ఎస్టేట్ నుంచి శశికళ తరిమేస్తారని చెప్పుకొచ్చాడు. 
 
తనకు తెలిసి నలుగురిని కొట్టి పంపించారని.. ఈ వయస్సులో జయలలిత మరణించేందుకు అవకాశమే లేదని.. ఆమె మరణం పట్ల అనుమానాలున్నాయన్నాడు. జయలలితకు ఏం జరిగిందో శశికళకు ఆమె కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసునని.. వారు చట్టం చేతిలో నుంచి తప్పించుకోవచ్చు. అయితే దేవుడి దృష్టిలో నుంచి తప్పలేరని హెచ్చరించాడు.