గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 25 సెప్టెంబరు 2017 (21:22 IST)

ప్రధానమంత్రి 'సౌభాగ్య' పథకం... 3 కోట్ల మందికి ఉచిత విద్యుత్...

ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూసిన ప్రజలకు సోమవారం నాడు ప్రధాన మంత్రి ఓ తీపి కబురు చెప్పారు. దిగువ మధ్యతరగతి, పేదలను దృష్టిలో పెట్టుకుని సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య) పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామం, పట్టణం, ఇల్లు కాంతులతో నిండిపోవాలనీ

ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూసిన ప్రజలకు సోమవారం నాడు ప్రధాన మంత్రి ఓ తీపి కబురు చెప్పారు. దిగువ మధ్యతరగతి, పేదలను దృష్టిలో పెట్టుకుని సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య) పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామం, పట్టణం, ఇల్లు కాంతులతో నిండిపోవాలనీ, 2019 మార్చి 31లోగా విద్యుద్ధీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
 
దారిద్ర్య రేఖకు దిగువున వున్నవారికి కరెంట్ కనెక్షన్ ఉచితంగా ఇస్తారు. ఎగువున వున్నవారికి కనెక్షన్ ఇచ్చేందుకు రూ.500 తీసుకుంటారు. దీన్ని కూడా 10 వాయిదాల్లో కరెంటు బిల్లుల ద్వారా ఇచ్చేట్లు సర్దుబాటు చేస్తారు. 
 
ఇకపోతే సౌభాగ్య పథకం మొత్తం వ్యయం అంచనా రూ.16,320 కోట్లుగా ప్రకటించారు. ఈ మొత్తం వ్యయంలో రూ.12,320 కోట్లు కేంద్రం భరించనుండగా మిగిలిన ఖర్చు రాష్ట్రాలు భరించనున్నాయి. పేదల జీవితాన్ని బాగు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ వెల్లడించారు.