1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (22:09 IST)

నీట్-యూజీ 2021 ఫలితాలు ఎట్టకేలకు విడుదల

నీట్-యూజీ  2021 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈ ఫలితాల వెల్లడికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్.టి.ఎ) నేడు నీట్ ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలను http://neet.nta.nic.in/  వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.
 
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ముంబైలోని ఓ పరీక్షా కేంద్రంలో ఇద్దరు విద్యార్థుల ఓఎంఆర్‌ షీట్లు తారుమారైనందున వారికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ముంబై హైకోర్టు ఆదేశించింది. అంతవరకు ఫలితాల విడుదల నిలిపివేయాలంటూ స్పష్టం చేసింది. ముంబై హైకోర్టు తీర్పుపై ఎన్‌టీఏ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా.. కేవలం ఇద్దరి కోసం 16లక్షల మంది విద్యార్థుల ఫలితాలు ఆపలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.  
 
కానీ సుప్రీంకోర్టు గురువారం ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం రాత్రి నీట్‌ ఫలితాలు విడుదల చేసింది. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాతి రోజే ఫైనల్‌ కీ, పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారని విద్యార్థులు అనుకున్నారు. 
 
కానీ నాలుగు రోజులైనా ఫలితాలు రాకపోవడంపై ఆందోళన చెందారు. కానీ పరీక్షా ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్‎లోని విజయవాడకు చెందిన రుషీల్‌ నీట్‌లో ఐదో ర్యాంకు సాధించాడు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన శరణ్య 60వ ర్యాంకుతో సత్తా చాటారు.