బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 7 మే 2019 (18:03 IST)

భార్యతో రాసలీలలు.. ఆటో డ్రైవర్‌ను నడిరోడ్డుపై నరికిన వ్యక్తి.. సీసీటీవీలో?

తమిళనాడులోని నెల్లైలో ఘోరం జరిగింది. నడిరోడ్డుపైనే ఆటో డ్రైవర్‌ను అడ్డంగా నరికారు. ఈ దారుణ హత్య ఆ రోడ్డులోని సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. నెల్లై, పళయపేట్టకు చెందిన ఆటో డ్రైవర్ కుట్టి.. ఏప్రిల్ మూడో తేదీ టౌన్ ఆర్చ్ వద్ద ఆగంతకుల చేత హత్యకు గురయ్యాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారాలను పరిశీలించారు. సీసీటీవీలో ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురికావడం.. నడిరోడ్డుపై ఈ దుర్ఘటన జరిగినా ఒక్కరూ కూడా అడ్డుకోకపోవడం చూసి పోలీసులు షాకయ్యారు. 
 
ఆటో డ్రైవర్ అయిన కుట్టిని మురుగన్ అనే వ్యక్తి దారుణంగా నరికి చంపాడని.. ఇందుకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు చెప్తున్నారు. మురుగన్ భార్యతో కుట్టి సన్నిహితంగా వుంటూ రావడాన్ని జీర్ణించుకోలేకపోయిన మురుగన్ నడిరోడ్డుపైనే అతనిని అడ్డంగా నరికేశాడని పోలీసులు వెల్లడించారు. దీంతో మురుగన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై పాలయంకోట్టై జైలుకు తరలించారు.