గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (16:45 IST)

చిన్నమ్మ తలరాతను మార్చిన సుప్రీం తీర్పు.. సీఎం కుర్చీ అంగట్లో సరుకు కాదంటూ...

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై నెటిజన్లు పన్నీటి జల్లు కురిపిస్తున్నారు. అదేసమయంలో వీకే శశికళ వైఖరిని ఎండగడుతున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చిన్నమ్మ తలరాతను మార్చిందంటూ క

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై నెటిజన్లు పన్నీటి జల్లు కురిపిస్తున్నారు. అదేసమయంలో వీకే శశికళ వైఖరిని ఎండగడుతున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చిన్నమ్మ తలరాతను మార్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 
జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం ఉదయం 10.30 గంటలకు తుది తీర్పును వెలువరించిన విషయం తెల్సిందే. ఈ తీర్పులో జయలలితతో సహా నిందితులుగా ఉన్న నలుగురిని ముద్దాయిలుగా కోర్టు తేల్చింది దీంతో ముఖ్యమంత్రి కావాలన్న శశికళ ఆశలు ఆవిరైపోయాయి. 
 
దీనిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. ఇంతవరకు ఎగిరెగిరి పడిన మెరీనా బీచ్.. ఒక్కసారిగా ప్రశాంతంగా మారింది. నేటి ఉదయం 10:45కు అటుఇటు సుప్రీం కోర్టు చిన్నమ్మ ‘తలరాత’ను మార్చేసింది. యావత్తు భారతావని పులకించింది. ‘చట్టం తనపని తాను చేసుకుపోతుందని అందరూ చెబుతుంటే ఏమో అనుకున్నాం’.. ఇప్పుడు సాక్షాత్తూ చూస్తున్నాం అని ‘నేటిజనులు’ కీర్తిస్తున్నారు. 
 
తమిళనాడుపై సుప్రీం కోర్టు ‘పన్నీటి’ జల్లు కురిపించిందని సోషల్‌మీడియాలో ఆనందభాష్పాలు రాలుస్తున్నారు. శశికళను దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన సుప్రీం తీర్పుపై సోషల్‌మీడియాలో నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.  ఫేస్‌బుక్‌లో నెటిజన్లు పెట్టిన కొన్ని ఆసక్తికర కామెంట్లు...
 
1. అధర్మం ఓడిపోయింది.. ధర్మం గెలిచింది
2. కలగానే.. కలగానే.. సీఎం సీటు కలగానే!
3. చట్టం ఎవరికీ చుట్టం కాదు.. సుప్రీం పర్‌ఫెక్ట్ తీర్పునిచ్చింది
4. భారతదేశానికి బంగారు రోజులు రానున్నాయి.
5. గుడ్ డెసిషన్.. గాడ్ ఈజ్ గ్రేట్
6.దేవుడున్నాడు.. న్యాయం జరిగింది. యజమాని చనిపోతే ఆమె కుర్చీలో కూర్చోవాలని ఒక సేవకురాలు కలగనడం ఏంటి?
7. ఎమ్మెల్యేలంతా తన చేతిలో ఉండికూడా ఏం చేయలేకపోయింది. ఇదీ రాజకీయమంటే. 
8. చాలా మంచి నిర్ణయం. ఆమె(శశికళ)ను ఉరితీయండి. జయలలితను చంపింది కూడా ఆమే.
9. గవర్నర్ విద్యాసాగర్ రావు చేసిన ఆలస్యం.. తమిళనాడుకు అమృతం.
10. సీఎం కుర్చీ అంగట్లో సరుకు కాదు. మోసానికి మోసమే జరిగింది.