ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 11 జనవరి 2017 (04:41 IST)

కొత్త పెద్దనోటుకు జంతువుల కొవ్వు పూశారా? రూ.2 వేల నోటుపై కొత్త దుమారం

2 వేల రూపాయల నోటు జంతువుల కొవ్వుతో తయారైందని అందుకే దాన్ని నీటిలో శుభ్రం చేసినప్పుడు మురికివాసన వస్తోందని కొత్త పెద్దనోటు విమర్సకులు ఆరోపణ చేస్తున్నారు.

మంగళయాన్ ఎగిరిపోయింది. మైక్రో చిప్ మాట పారిపోయింది. తడిస్తే చెడిపోతుందన్న నోటు ఎండిపోయింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ తీసుకొచ్చిన 2 వేల రూపాయ నోటుపై వచ్చిన అన్ని రూమర్లూ అదృశ్యమైపోయాయి. ఇప్పడు తాజాగా ఈ నోటుపై వచ్చిన ఆరోపణ విపరీతంగా ప్రాచుర్యం పొందుతోంది. 2 వేల రూపాయల నోటు జంతువుల కొవ్వుతో తయారైందని అందుకే దాన్ని నీటిలో శుభ్రం చేసినప్పుడు  మురికివాసన వస్తోందని కొత్త పెద్దనోటు విమర్సకులు ఆరోపణ చేస్తున్నారు. 
 
జంతువుల కొవ్వు కలిపినందువల్లే కొత్త నోటు బాగా మెరుస్తోందని, దీనికారణంగానే ఈ నోటు చాలాకాలం మనగలుగుతుందని విమర్సకులు అంటన్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కొత్త నోట్లపై ఇలాంటి ఆరోపణలు తరచుగా వస్తున్నందున ఈ పుకారు నిజమా కాదా అని తేల్చడానికి పరిశీలన జరుగుతున్నట్లు సమాచారం. 
 
ఇంగ్లండ్ లోనూ ఇదే మాదిరిగా కొత్త 5 పౌండ్ల నోటుపై జంతువుల కొవ్వు కనిపించినట్లు వార్తలు రావడంతో జంతుకొవ్వు కలిపిన అలాంటి నోట్లు తీసుకోవడానికి శాకాహారులు వ్యతిరేకించారు. మన దేశంలో పుకారు రాయుళ్లు దీనికి మరిన్ని చిలువలు, పలువలు పేర్చి వాషింగ్ మెషిన్‌లో రెండువేల రూపాయన నోటను ఉంచి క్లీన్ చేస్తుంటే నోటుపై ఉన్న కొవ్వు పోతోందని ఆ స్థితిలో అది మురికివాసన వస్తోందని పుకార్లు రేపుతున్నారు. 
 
కొత్త పెద్ద నోటుపై ఈ సరికొత్త ఆరోపణలు, పుకార్లలోని నిజానిజాలు ఎవరికెరుక?