బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 మార్చి 2017 (18:19 IST)

వధువు డ్యాన్స్ అదిరింది.. భలే అనిపించింది... 60లక్షల మంది వ్యూస్.. (Video)

సాధారణంగా సంగీత్ కార్యక్రమంలో వరుడు, వధువు స్టెప్పులేయడం, బంధువులు డ్యాన్స్ చేయడం మామూలే. అయితే ఉత్తరాదిన జరిగిన ఓ పెళ్లి వేడుకలో భాగంగా నిర్వహించిన సంగీత్ కార్యక్రమంలో వధువు అద్భుతంగా డ్యాన్స్ చేసి ఆ

భారతీయ వివాహాలు సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తాయి. ఉత్తరాదిన జరిగే వివాహాలు మూడు రోజుల పాటు జరుగుతుంటాయి. అక్కడ వివాహానికి ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్లు అట్టహాసంగా జరుగుతాయి. ధనికులైతే వివాహ వేడుకలను కోట్లు ఖర్చుపెట్టి అట్టహాసంగా జరుపుకుంటారు. ఇటీవల మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి తన కుమార్తె పెళ్లిని కోట్ల మేర ఖర్చు పెట్టి అట్టహాసంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. గాలి కూతురి సంగీత్ కార్యక్రమంలో టాలీవుడ్ హీరోయన్లు తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.
 
అలాగే సాధారణంగా సంగీత్ కార్యక్రమంలో వరుడు, వధువు స్టెప్పులేయడం, బంధువులు డ్యాన్స్ చేయడం మామూలే. అయితే ఉత్తరాదిన జరిగిన ఓ పెళ్లి వేడుకలో భాగంగా నిర్వహించిన సంగీత్ కార్యక్రమంలో వధువు అద్భుతంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. వరుడి ముందు చేసిన డ్యాన్స్ భలే అనిపించింది. 
 
ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో వధువుకు ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు సహాయపడ్డారు. పాట ప్రారంభంలో ఆమె డాన్స్ అందుకోగా, వంతుల వారీగా ఆమె స్నేహితులు, సోదరులు, తల్లిదండ్రులు,  పిన్ని, బాబాయిలు, చివరికి నడవడం కష్టమైన నాన్నమ్మ కూడా జత కలవడంతో ప్రోగ్రామ్ రక్తికట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందుకు లైక్స్, షేర్లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. జనవరిలో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను సోషల్ మీడియా 68 లక్షల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. మరి మీరూ ఓ లుక్కేయండి.