శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (19:45 IST)

ఇంట్లో చికెన్ వండవద్దని చెప్పిన భార్య.. పట్టుబట్టిన భర్త.. చివరికి?

అసలే లాక్ డౌన్. కొత్త జంట వేరే. హ్యాపీగా వుంటారనుకుంటే.. చికెన్ వండలేదనే దానిపై గొడవపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. భర్తకు చికెన్ వడ్డించడంలో గొడవపడిన అనంతరం కొత్తజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అస్సాంలోని లఖింపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్య మరణించగా, భర్త పరిస్థితి విషమంగా వుందని ఇసానగర్ పోలీసులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. లఖింపూర్‌కు చెందిన గురు దయాళ్‌(22), రేష్మా(19)ను జూన్‌ 19న వివాహం చేసుకున్నాడు. రేష్మా వెజిటేరియన్‌ కావడంతో తన భర్త సోమవారం చికెన్‌ తీసుకువచ్చి తల్లికి వండమని ఇచ్చాడు. అది చూసిన రేష్మా ఇంట్లో చికెన్‌ వండటానికి వీలు లేదని, బయట వండుకొమ్మని భర్తకు చెప్పింది. అయినా అతడు వినిపించుకోకుండా ఇంట్లోనే వండమని తన తల్లికి చెప్పాడు. 
 
దీనిపై రేష్మాకు గురుల మధ్య గొడవ జరిగింది. అనంతరం కొత్త జంట రాత్రి ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిని చూసిన గురుదయాళ్‌ తండ్రి శివనాథ్‌ ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పోందుతూ రేష్మా మరణించింది. 
 
ప్రస్తుతం గురుదయాళ్‌ పరిస్థితి విషయంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని, గురుదయాళ్ ఆరోగ్యం మెరుగుపడ్డాక అతడి వాంగ్మూలం తీసుకున్నాకే కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.