బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (20:11 IST)

ముష్కరులతో లింకులు - సిమ్లా ఎస్పీ అరెస్టు

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ)కు చెందిన రహస్య పత్రాల లీకేజీ కేసులో ఐపీఎస్ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన పేరు అరవింద్ నేగి. ప్రస్తుతం ఈయన సిమ్లా ఎస్పీగా కొనసాగుతున్నారు. గతంలో ఎన్.ఐ.ఏలో పనిచేశారు. 
 
కొంతకాలం క్రితం ఎన్.ఐ.ఏలో రహస్య పత్రాల లీకేజీ ఘటన చోటుచేసుకుంది. ఈ పత్రాల లీకేజే కేసులో ఎన్.ఐ.ఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ విచారణలో భాగంగా అరవింద్ నేగికి సంబంధం ఉన్నట్టు తేలింది. దీంతో ఆయన్ను అరెస్టు చేసింది. 
 
లష్కరే కార్యకలాపాలపై నమోదైన కేసులో భాగంగా ఆ అధికారిని ఎన్.ఐ.ఏ అధికారులు అరెస్టు చేశారు. కాగా, లష్కర్ నెట్ వర్క్ వ్యాప్తికి సంబంధించి అధికారులు గతంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
తాజాగా ఐపీఎస్ అధికారి అరవింద్ నేగిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు చెందిన ఇళ్లలో సోదాలు జరిపారు. అధికారిక రహస్య పత్రాలను లష్కరే ఉగ్రవాద సంస్థకు లీక్ చేసినట్టు ఎన్.ఐ.ఏ అధికారులు జరిపిన దర్యాప్తులో తేలింది.