తొమ్మిది నెలల చిన్నారి.. మందు సీసా మూతను మింగేశాడు..
నెలల వయసు ప్రాయంలో వున్న చిన్నారుల చేతికి చిన్న చిన్న వస్తువులు అందకుండా చూసుకోవాలి. అప్పుడే వాటిని నోటిలో వేయడం చేయరు. ఆడుకునేందుకు వీలుగా పెద్ద బొమ్మలను ఇవ్వడం చేయాలి. ప్రమాదకరమైన వస్తువులను వారికి అందుబాటులో వుంచకూడదు.
కానీ తాజాగా తొమ్మిది నెలల బాలుడు ఓ మందు సీసా మూతను మింగేశాడు. బాధకు విలవిల్లాడిపోయాడు. ఈ ఘటన ఒడిశాలోని సోంపేట మండలంలో చోటు చేసుకుంది. వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆ మూతను బయటకు తీయడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. రుషికుడ్డ గ్రామానికి చెందిన రాము ఇంటి వద్ద తన అన్న సాత్విక్ (4)తో ఆడుకుంటూ మందు సీసా మూత మింగాడు. ఊపిరి పీల్చలేకపోయాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్చారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు గొంతు నుంచి మూతను బయటకు తీసి బాలుడి ప్రాణాలు రక్షించారు.