శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (18:22 IST)

రెండు లారీలు ఢీ, ఇరుక్కుపోయిన వ్యక్తి గ్రేట్ ఎస్కేప్(Video)

తృటిలో తప్పిన ప్రాణాపాయం
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి శివారులోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో రెండు లారీలు బీభత్సం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున రెండు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. కాగా రోడ్డును దాటుతూ రెండు లారీల మధ్య ఓ వ్యక్తి ఇరుక్కుపోయాడు. 
 
అయితే ఆ వ్యక్తి  ఎలాంటి గాయాలు లేకుండా అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు. రెండు లారీలు రోడ్డుపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసి రోడ్డుపై నుంచి లారీలను తొలగించారు. రెండు లారీలు ఢీకొన్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి.