మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 26 మార్చి 2018 (09:32 IST)

నీరవ్ ఎక్కడున్నాడో.. ప్రధానిని అడగండి: రాహుల్ గాంధీ ధ్వజం

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ప్రధాని కర్ణాటకకు వస్తే నీరవ్ గురించి అడగాలని కర్ణాటక ప్రజలకు రాహుల్ గాంధీ సూచించారు. దేశానికి కాపలాదారుగా ఉంటానని చెప్పిన

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ప్రధాని కర్ణాటకకు వస్తే నీరవ్ గురించి అడగాలని కర్ణాటక ప్రజలకు రాహుల్ గాంధీ సూచించారు. దేశానికి కాపలాదారుగా ఉంటానని చెప్పిన మోడీ.. వేలకోట్లు గుంజుకున్న వారిని దేశం దాటించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీది పేదల ప్రభుత్వమని రాహుల్ గాంధీ అన్నారు. 
 
అయితే పేదలను, రైతులను బీజేపీ పట్టించుకోలేదన్నారు. ఆదివారం శ్రీరంగ పట్టణంలో రాహుల్ రోడ్ షో చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధానికి ఏకిపారేశారు. అబద్దపు హామీలతో మోడీ సర్కారు ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. బీజేపీ సర్కారు కార్పొరేట్లకు దోచి పెట్టిందని.. తాము ప్రజలపక్షాన ఉంటామన్నారు. 
 
విద్యార్థులందరికి ల్యాప్ టాప్‌లు ఇస్తామని రాహుల్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం మైసూరులో సీఎం సిద్ధరామయ్యతో కలిసి.. రోడ్ షో చేసిన రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో ప్రజలకు హామీల వర్షం కురిపించారు. 
 
అలాగే కోట్లు గుంజేసుకుని బ్యాంకులకు చుక్కలు చూపించి దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యా సంగతేంటని రాహుల్ ప్రశ్నించారు. ఇంకా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కుమారుడి అవినీతిని కూడా రాహుల్ గాంధీ ఎండగట్టారు.