ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 15 మార్చి 2018 (14:59 IST)

ఆశాదేవిది చక్కని శరీరాకృతి.. నిర్భయ ఎంత అందంగా వుండేదో..? నోరుజారిన మాజీ డీజీపీ

కర్ణాటక మాజీ డీజీపీ సంగ్లియానా సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. సంగ్లియానా తాజాగా అత్యాచారాలపై నోరు జారారు. అత్యాచారాల్లో చిక్కుకున్నప్పుడు లొంగిపోవాలి. తర్వాత కే

కర్ణాటక మాజీ డీజీపీ సంగ్లియానా సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. సంగ్లియానా తాజాగా అత్యాచారాలపై నోరు జారారు. అత్యాచారాల్లో చిక్కుకున్నప్పుడు లొంగిపోవాలి. తర్వాత కేసు పెట్టుకోవాలి. అలా చేస్తే సురక్షితంగా బయటపడగలం. ప్రాణాలను కాపాడుకోగలం అంటూ సంగ్లియానా సూచించారు. 
 
ఇంకా ఢిల్లీలో కదిలే బస్సులో పారామెడికల్ విద్యార్థినిపై అత్యంత పాశవికంగా జరిగిన సామూహిక అత్యాచారం, హత్య ఘటన దేశంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధితురాలిని దేశ ప్రజలు నిర్భయ అని పిలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన కుమార్తె (నిర్భయ)కు జరిగిన అన్యాయంపై బాధితురాలి తల్లి ఆశాదేవి న్యాయపోరాటం చేశారు. ఈమెతో పాటు మరికొందరి సేవలను గుర్తిస్తూ బెంగళూరులో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో సంగ్లియానా మాట్లాడుతూ.. నిర్భయ తల్లి ఆశాదేవి చక్కని శారీరాకృతిని కలిగివున్నారని తెలిపారు. 
 
ఆశాదేవి శారీరాకృతిని చూస్తే.. ఆమె కుమార్తె (నిర్భయ) ఎంత అందంగా ఉండేదో తానిప్పుడు ఊహించుకుంటున్నానని నోరు జారారు. అత్యాచారాలు వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు పోరాడే సత్తా వుంటే పోరాడాలని.. లేకుంటే లొంగిపోవాలన్నారు. అలాచేస్తే ప్రాణాలైనా మిగులుతాయని సంగ్లియానా అభిప్రాయపడ్డారు.