బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 13 మార్చి 2018 (17:35 IST)

సితార మా అమ్మలాగానే వుంది.. ఫోటో చూడండి.. మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ''భరత్ అనే నేను'' సినిమాలో నటిస్తున్నారు. గతంలో కొరటాలతో మహేష్ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు బంపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కా

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ''భరత్ అనే నేను'' సినిమాలో నటిస్తున్నారు. గతంలో కొరటాలతో మహేష్ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు బంపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాస్త విరామం దొరికితే.. ఫ్యామిలీతో గడిపే మహేష్ బాబు తాజాగా తన కుమార్తె గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చారు. మహేష్ బాబు కుమార్తె సితార సోషల్ మీడియా సెలెబ్రిటీ అనే సంగతి అందరికీ తెలిసిందే. 
 
సితార ఫోటోలు, వీడియోలో ఇప్పటికే వైరల్ అయిన దాఖలాలున్నాయి. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు తన కుమార్తె ఫోటోను ఇన్‌‍స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. తన కుమార్తె సితార అచ్చం తన అమ్మ ఇందిరాదేవి లాగానే వుంటుందని చెప్పారు. ఇంకా సితార ఫోటోను పోస్టు చేస్తూ అమ్మ-సితార ఒకేలా వున్నారంటూ హర్షం వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా పోస్టు చేసిన ఫోటోకు "పింగ్ గర్ల్ పవర్" అంటూ మహేష్ కామెంట్ చేశాడు. ఈ ఫోటోను పోస్ట్ చేసిన 15 గంటల్లోనే 1.08 లక్షల లైక్స్ వచ్చాయి. నిజంగానే సితార మహేశ్ అమ్మగారి లాగే ఉందంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరూ ఆ ఫోటో చూడండి.