సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (15:32 IST)

నిర్భయ కేసు : దోషుల ఉరితీతకు ముందు జరిగే ప్రక్రియ ఏంటి?

నిర్భయ కేసులో అత్యాచారానికి పాల్పడిన దోషులకు జనవరి 22వ తారీఖున ఉరిశిక్ష ఖరారు చేయడంతో నలుగురు దోషులకు ఈ విషయం తెలిసి నలుగురు దోషులు జైలులో ఏడ్చారు అని తీహార్ జైలు సోర్సెస్ తెలుపుతున్నాయి. జనవరి 22వ తారీకు వరకు ఈ నలుగురు దోషులకు విషయంలో తీహార్ జైలు ఏ విధంగా వ్యవహరించనున్నది అనేది అరా తీస్తే తెలిసిన విషయాలు ఇలా వున్నాయి.
 
1. ఇకపై వీరిని ఐసోలేటెడ్ జైళ్లలో ఉంచుతారు. 
2. ఇకపైన వారితో చేయించే రోజువారి జైలు పని చేయించరు. 
3. ఉరిశిక్ష పడే వరకు నలుగురిని విడివిడిగా కండమ్ సెల్‌లో ఉంచుతారు. 
4. 24 గంటలు వీరిని జైలర్ పర్యవేక్షిస్తూ ఉంటారు. 

5. 22వ తారికున ఉరిశిక్ష పడే అంతవరకు వీరితో ఎవ్వరూ మాట్లాడరు. అలాగే వీరిని ఎవరితో కలవనివ్వరు. 
6. క్షణక్షణం మృత్యువు గురించి మాత్రమే ఆలోచించేలాగా పరిస్థితులు కల్పిస్తారు. 
7. ఉరిశిక్ష అమలు అయ్యేంతవరకు ఈ నలుగురు దోషుల శారీరిక మానసిక ఆరోగ్య పరీక్షలు జరుపుతా ఉంటారు.
8. ఈ నలుగురు దోషులకు దగ్గర  ఏమైనా ఆస్తి ఉంటే ఆస్తి ఎవరి పేరున రాయాలి అనుకుంటున్నారు అని కనుక్కుని ఆ మేరకు వారితో విల్ రాయిస్తారు.
 
9. ఈ నలుగురు దోషులకు చివరి కోరికను అడిగి తెలుసుకుంటారు.  
10. అలాగే తమ కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరిని మాత్రమే కలవాలి అనుకుంటే ఒక్కసారి మాత్రమే కలవడానికి అవకాశం ఇస్తారు.
11. వీరి ఉరిశిక్ష అమలు చేయడానికి ఉత్తరప్రదేశ్ నుంచి ఉరి తీసే ఉద్యోగి వచ్చి వీరి ఉరిశిక్షను అమలు చేస్తారు. ఎందుకంటే తీహార్ జైలులో ఉరి శిక్ష అమలు చేసే ఉద్యోగి లేకపోవటం వలన ఉత్తరప్రదేశ్ నుంచి ఉరిశిక్ష అమలు చేసే ఉద్యోగిని పిలిపించడం జరుగుతున్నది. 
 
12. గతంలో ఎప్పుడూ కూడా నలుగురికి ఒకేసారి తీయాల్సిన పరిస్థితి రానందున ఉరితీసే ప్లాట్ఫామ్ చిన్నదిగా ఉంది.
నిర్భయ కేసులో నలుగురు దోషులను ఒకే సమయంలో ఉరి తీయాలని తీర్పు ఉండటం వలన ఉరితీసే స్థలాన్ని పెద్దదిగా చేశారు. 
13. చివరగా ఉరి తీసే ఉరితాడు బాక్సర్ నుంచి ఈ సరికే తెప్పించారు తీహార్ జైలు అధికారులు.
14. ఉరి తీసే ఉద్యోగి 21వ తారీఖున ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత ఓ రోజు ముందు ఓసారి డమ్మీలను పెట్టి ఉరి తీసే ప్రక్రియను ప్రాక్టీస్ చేయనున్నారు.