ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 జులై 2017 (10:03 IST)

వరకట్న వేధింపుల కేసులో.. వెంట వెంటనే అరెస్టులు వద్దు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

వరకట్న వేధింపుల కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వరకట్న వేధింపుల కేసులో బాధితురాలు ఫిర్యాదు అందిన వెంటనే అరెస్టులు చేయవద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ చట్టాన్ని కొందరు

వరకట్న వేధింపుల కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వరకట్న వేధింపుల కేసులో బాధితురాలు ఫిర్యాదు అందిన వెంటనే అరెస్టులు చేయవద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ చట్టాన్ని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. బాధిత మహిళల ఆరోపణలపై నిజానిజాలు నిర్ధారించుకోకుండా అరెస్టు వద్దని ఏకే గోయల్, యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది.
 
అందుకు ప్రతిగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ (ఎఫ్‌డబ్ల్యూసీ)లు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. వాటి ద్వారా ఫిర్యాదులోని నిజానిజాలను తేల్చాకే అరెస్టులు చేయాలని సూచించింది. వరకట్న వేధింపుల కేసుపై ఎఫ్‌డబ్ల్యూసీ నివేదిక అందిన తర్వాత పోలీసులు తదుపరి చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొంది.