శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (13:45 IST)

ఎంపీ పదవికి బాబుల్ సుప్రియో రాజీనామా..

Babul Supriyo
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబుల్ సుప్రియో తన ఎంపీ పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. మంగళవారం ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా నివాసానికి వెళ్లిన బాబుల్ సుప్రియో.. నేరుగా ఆయనకు రాజీనామా లేఖను సమర్పించారు. 
 
అనంతరం ఓం బిర్లా నివాసం ముందు మీడియాతో మాట్లాడుతూ.. తాను తన రాజకీయ జీవితాన్ని బీజేపీతోనే ప్రారంభించానని, కానీ గుండె బరువు చేసుకుని ఆ పార్టీని వీడాల్సి వచ్చిందని చెప్పారు.
 
తనకు పార్టీలో ఇన్నాళ్లు పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు బాబుల్ సుప్రియో కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో వారు తనపై ఎంతో విశ్వాసం ఉంచారని గుర్తుచేసుకున్నారు. 
 
అయితే, పార్టీ నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ పార్టీ ఎంపీగా కొనసాగడటం కరెక్టు కాదని, అందుకే తాను ఇవాళ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశానని చెప్పారు. బాబుల్ సుప్రియో గత నెలలో బీజేపీని వీడి టీఎంసీలో చేరారు.