శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 27 ఆగస్టు 2017 (10:15 IST)

అన్నగారి విగ్రహం తెనాలిలో తయారై.. బెంగళూరు పార్కుకు వెళ్లింది.. ఎంజీఆర్ విగ్రహం కూడా?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్ని కర్ణాటక రాజధాని బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌ జె.పి పార్కులో ప్రతిష్టించనున్నారు. ఈ పార్కులో ప్రతిష్టించనున్న విగ్రహా

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్ని కర్ణాటక రాజధాని బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌ జె.పి పార్కులో ప్రతిష్టించనున్నారు. ఈ పార్కులో ప్రతిష్టించనున్న విగ్రహాల తయారీకి కళల కాణాచి తెనాలి వేదికైంది. విగ్రహాల తయారీలో తెనాలికున్న పేరు ప్రఖ్యాతులు తెలుసుకున్న ఆ రాష్ట్ర ఎమ్మెల్యే మునిరత్నం పట్టణానికి చెందిన శిల్పి కాటూరి రవిచంద్రను సంప్రదించారు.
 
దేశానికి చెందిన 34 మంది ప్రముఖుల విగ్రహాలను తయారు చేసేందుకు ప్రణాళిక వేసి.. మూడు నెలల కాలంలో ఫైబర్ విగ్రహాలను తీర్చిదిద్దారు. ఇందులో చత్రపతి శివాజీ, టిప్పు సుల్తాన్‌, ఝాన్సీరాణి, బాబూరాజేంద్ర ప్రసాద్‌, నెహ్రూ, వల్లభాయ్‌ పటేల్‌, అంబేడ్కర్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, భగత్‌సింగ్‌, మడకరి నాయక, సంగోలి రాయన్న, జయచామరాజ వడయార్‌, ఇందిరాగాంధీ, పింగళి వెంకయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్యల విగ్రహాలున్నాయి. 
 
అంతేగాకుండా ఎన్టీ రామారావు, ఎం.జి.రామచంద్రన్‌, రాజకుమార్‌, ప్రేమ్‌ నజీర్‌, కె.సి.రెడ్డి, వినాయక కృష్ణ గోకక్‌, హనుమంతయ్య, చంద్రశేఖర్‌ కుమార్‌, మస్తి వెంకటేష్‌ అయ్యంగార్‌ తదితరుల విగ్రహాలు ఉన్నాయి. శనివారం వీటిని బెంగళూరుకు తరలించారు.